మీరు అనుకునేది కాదు: బాద్షా

హీరోయిన్ మృణాల్ ఠాకూర్, సింగర్ బాద్షా చేతిలో చెయ్యి వేసుకొని ఒక పార్టీకి రావడం, వెళ్లడం పెద్ద సంచలనమే కలిగించింది. నిన్నా అంతా ట్విట్టర్ మార్మోగింది. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. వీరు “డేటింగ్” చేస్తున్నారేమో అని వార్తలు అల్లేశాయి మీడియా కంపెనీలు.

దాంతో, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ బాద్షా ఈ రోజు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. “మీరు అనుకునేది ఏమి లేదక్కడ” అనే అర్థంలో ఉంది ఆ పోస్ట్. అంటే మృణాల్, తాను డేటింగ్ లో లేమని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు.

ALSO CHECK: Mrunal Thakur’s latest clicks

శిల్పాశెట్టి ముంబైలో నిర్వహించిన దీపావళి పార్టీకి మృణాల్ ఠాకూర్, బాద్షా అటెండ్ అయ్యారు. ఆ పార్టీకి చెందిన ఫోటోలు, వీడియోలే కలకలం రేపాయి. “మరోసారి మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. కానీ మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో అది లేదక్కడ,” అని రాశాడు బాద్షా తన పోస్ట్ లో. మృణాల్ ఠాకూర్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు ఈ విషయంలో ఇప్పటివరకు.

ఆమె త్వరలోనే “హాయ్ నాన్న” సినిమా ప్రమోషన్ లో పాల్గొనాలి. అలాగే విజయ్ దేవరకొండతో “ఫ్యామిలీ స్టార్” చిత్రం షూటింగ్ కి హాజరవ్వాలి.

Advertisement
 

More

Related Stories