- Advertisement -

దిల్ రాజు ఇప్పుడు ఇండియాలో పెద్ద నిర్మాతల్లో ఒకరు. ఆయన చిన్న సినిమాలు తీయడం మానేశారు. ఐతే, తన కూతురు (హన్షిత), సోదరుడు కుమారుడు హర్షిత్ నిర్మాతలుగా మారడంతో వారితో చిన్న సినిమాలు, కాన్సెప్ట్ సినిమాలు తీయించడం మొదలు పెట్టాలనుకున్నారు. అలా వచ్చిన చిత్రం ..’బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ నటించిన ఈ సినిమాకి కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. రివ్యూస్, టాక్ బాగుండడంతో దిల్ రాజు మీడియాతో ముచ్చటించారు…
- నేను కెరీర్ ప్రారంభంలో కొత్త దర్శకులతో సినిమాలు చేశాను. ఆర్య, బొమ్మరిల్లు అలా వచ్చినవే. మా పిల్లలు హర్షిత్, హన్షితలకు కూడా అదే చెప్పాను. బలగం కథ నచ్చడంతో వాళ్ళకి చెప్పి ఇది చేసుకోండని పురమాయించాను. పాండమిక్ తర్వాత ప్రేక్షకులు చిన్న సినిమాలు చూడటానికి పెద్దగా రావటం లేదు కాబట్టి దానికి తగ్గట్లు సినిమాని ప్లాన్ చేసుకోమన్నాను. స్క్రిప్ట్ స్టేజ్ నుంచే చాలా వర్క్ చేశారు. ఐతే అనుకున్న దానికన్నా కొంచెం ఖర్చు ఎక్కువైంది. అయినా ఓటిటి, శాటిలైట్ రైట్స్ తో కవర్ అయింది. ఇప్పుడు థియేటర్ల నుంచి వస్తున్న అమౌంట్ వారికి అదనపు లాభం. మొదటి రోజు కన్నా రెండో రోజు కలెక్షన్లు బాగున్నాయి.
- ఇదీ చదవండి: అల్లు అర్జున్ ‘ఐకాన్’ ఛాన్స్ దిల్ రాజుకు లేనట్టా? అసలు ఐకానే ఉండదా?
- చూసిన వారందరూ చాలా బాగుందని అన్నారు. విమర్శకులు కూడా సినిమా గురించి పాజిటివ్‌గా స్పందించారు. ఇలాటి సినిమాలు హిట్ అయితే ఆ కిక్కే వేరు.
- వేణు ఎల్దండిలో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడని నాకు తెలియదు కానీ అతను కథ చెప్పే సమయంలోనే కనెక్ట్ అయ్యాను. నేను తెలంగాణలో చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. మనుషులు చనిపోయినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అప్పుడు ఎమోషన్స్ ఎలా ఉంటాయనే దాన్ని నేను దగ్గర నుంచి గమనించాను. మన సంస్కృతిలో ఏముందనే విషయాన్ని వేణు పట్టుకున్న తీరు నాకు బాగా నచ్చింది.

- డైరెక్టర్ వేణు ఎల్దండి మా బ్యానర్‌లోనే రెండో సినిమాను కూడా చేస్తున్నాడు.
- ఓ డాన్స్ మాస్టర్‌ను హీరోగా .. సింగర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ శశి అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాం. అది కూడా ఓ కాన్సెప్ట్ తో కూడిన మూవీ.