
‘క్రాక్’ సినిమాలో కొన్ని మాస్ సీన్లు తీసిన విధానం దర్శకుడు గోపీచంద్ మలినేనికి పేరు తెచ్చింది. ముఖ్యంగా సినిమాలోని బస్ స్టాండ్ ఫైట్, హీరోయిన్ శృతి హాసన్ కి పోకిరి తరహా ట్విస్ట్ ఇవ్వడంలో మార్క్ చూపించాడు. దాంతో, గోపీచంద్ కి సాలిడ్ కథ దొరికితే మాస్ హీరోలను బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి బాలయ్య అంటేనే మాస్ కదా. అందుకే, వీరిద్దరి కాంబినేషన్ ని సెట్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ట్రై చేస్తోందని ప్రచారం జరుగుతోంది.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ ఇప్పుడు సెట్ అవుతుందా? ‘క్రాక్’ తర్వాత యంగ్ హీరోలు, మార్కెట్ ఉన్న పెద్ద హీరోలతో చేసేందుకు మలినేని ఆసక్తి చూపుతాడా? అన్నది చూడాలి. డాన్, బలుపు, పండగ చేస్కో, విన్నర్ వంటి సినిమాలు తీశాడు మలినేని. ఇప్పటివరకు రవితేజతో చేసిన సినిమాలే వర్క్ అవుట్ అయ్యాయి. సాయి ధరమ్ తేజతో తీసిన విన్నర్ అపజయం పాలయింది.
బాలయ్య ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో నటిస్తున్నారు. మరో సినిమా ఇంకా అనౌన్స్ చెయ్యలేదు.