బాబాయ్ ని కించపర్చలేదు: బాలయ్య

Balakrishna

అక్కినేని నాగేశ్వరరావు గురించి నందమూరి బాలకృష్ణ వాడిన పదాలు వివాదాస్పదమయ్యాయి. బాలయ్య క్షమాపణలు చెప్పాలని ఏఎన్నార్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాలయ్య ఈ వివాదంపై గురువారం స్పందించారు.

ఏఎన్నార్ అందరికన్నా తనకి ఎక్కువ క్లోజ్ అని చెప్పుకున్నారు బాలయ్య. “బాబాయ్ పై ప్రేమ గుండెల్లో ఉంది. నేనంటే ఆయనకీ చాలా ఇష్టం.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల‌ను అభిమానులు రకరకాలుగా పిలుస్తారు. అంత మాత్రాన వారిని అవ‌మానించిన‌ట్టు కాదు. నాగేశ్వ‌ర‌రావు నాకు బాబాయే. ఏఎన్నార్ నుంచి పొగడ్తలకు పొంగిపోకూడదనే విషయాన్ని నేర్చుకున్నాను,” అని చెప్పారు బాలయ్య. రిపబ్లిక్ డే ఉత్సవాలలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు బాలకృష్ణ.

“కొన్ని ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు. మా నాన్న పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగింది. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుంది… బయట ఏం జరిగినా నేను పట్టించుకోను,” అని అన్నారు బాలయ్య.

ఆ విధంగా వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.

గత ఆదివారం ‘వీర సింహా రెడ్డి’ సినిమా సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతున్న సందర్భంలో “అక్కినేని తొక్కినేని” అనే మాట వాడారు. దాంతో వివాదం రేగింది.

 

More

Related Stories