బాలయ్యకి నచ్చిన ఉప్పెన

Balakrishna and Buchi Babu

నందమూరి బాలకృష్ణ సడెన్ గా ఒక చిన్న సినిమాని ప్రత్యేకంగా తిలకించడం విశేషమే. బాలకృష్ణ చూస్తానని అనడంతో ఆయన కోసం ‘ఉప్పెన’ మేకర్స్ స్పెషల్ షో వేశారు. బాలకృష్ణ, అయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఈ సినిమాని చూశారు. బాలయ్యకి సినిమా బాగా నచ్చిందట. దర్శకుడు బుచ్చిబాబుని అభినందించారు బాలయ్య.

మరోవైపు, ‘ఉప్పెన’ రెండోవారంలో కూడా కలెక్షన్లనే రాబడుతోంది. ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్లు కలెక్ట్ చేసింది. 50 కోట్ల వసూళ్లు అందుకుంటుంది అని అంచనా. కొత్తవారితో తీసిన సినిమాల్లో ఇదొక రికార్డ్.

బాలయ్య ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఇక ఈ సినిమా పూర్తి కాగానే గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య సినిమా మొదలుపెడతారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ‘ఉప్పెన’ని కూడా మైత్రి సంస్థ నిర్మించింది.

More

Related Stories