బాలయ్యతో రామానుజాచార్య తీస్తా!


నిర్మాత సి కళ్యాణ్ చెన్నైలో అమ్యూజ్ మెంట్ పార్క్ కడుతున్నారట. అలాగే, తెలుగులో మరిన్ని పెద్ద సినిమాలు తీస్తాను అని చెప్తున్నారు.

“నందమూరి బాలకృష్ణగారితో ‘రామానుజాచార్య’ ప్రాజెక్ట్ ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి,” అని తెలిపారు సి కళ్యాణ్. శుక్రవారం (డిసెంబర్ 9) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

అలాగే, పనిలో పనిగా నిర్మాత దిల్ రాజుపై విమర్శలు గుప్పించారు. దిల్ రాజు చేసి పని వల్ల ఇండస్ట్రీకి నయాపైసా ఉపయోగం లేదన్నారు. ఆయనది అంతా స్వార్థమే అని తీర్మానించారు.

“వారసుడు సినిమా విషయంలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాల నిర్మాతలు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేయకుండా ఈ విషయంలో కౌన్సిల్ మాట్లాడటం వంద శాతం తప్పు. అయితే చెడు గుణం వున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్లు ఇచ్చినా ఫైనల్ గా జీరోలుగానే మిగిలిపోతారు,” అని ఇన్ డైరెక్ట్ గా దిల్ రాజుపై కౌంటర్లు వేశారు.

Advertisement
 

More

Related Stories