- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షోని హోస్ట్ చెయ్యనున్నారు అని మొదటిసారి వార్తలు వచ్చినప్పుడు అందరూ నవ్వారు. బాలకృష్ణ స్పీచులు ఎక్కువగా ట్రోల్ అవుతుంటాయి. అలాంటి బాలయ్య షో హోస్ట్ చేయడమేంటి అన్న కామెంట్స్ వచ్చాయి. కానీ ఆయన హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోకి సంబంధించిన మొదటి ప్రోమో వచ్చింది. అది అందరిని సర్ప్రైజ్ చేసింది.
బాలయ్య హోస్ట్ గా అదిరిపోయారు. మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రోమోకి ఎక్కడా నెగెటివ్ రిమార్క్ రాకపోవడం విశేషం. మోహన్ బాబు ఎపిసోడ్ తర్వాత నానిని ఇంటర్వ్యూ చేస్తారు బాలయ్య.
బాలయ్య ఈ షో కోసం దాదాపు 5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. అహా వీడియో కోసం బాలయ్య ఈ షో చేస్తున్నారు.
బాలకృష్ణ ఈ షో హోస్ట్ గా సక్సెస్ అయితే ఓటిటి యువతకి కూడా ఆయన కనెక్ట్ అయినట్లే.