అభిమానికి ఫోన్ చేసిన బాలయ్య

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ ఒక అభిమానికి స్వయంగా ఫోన్ చేశారు. మంచాన పడ్డ అభిమానికి ధైర్యం నూరిపోశారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గొల్లపల్లికి చెందిన మురుగేష్ బాలయ్య అభిమాని. అతను కొంతకాలం క్రితం చెట్టు మీది నుంచి కిందపడ్డాడు. దాంతో నడుము విరిగింది. అప్పటినుంచి మంచానికే పరిమితం అయ్యాడు ఆ కుర్రాడు.

విషయం తెలుసుకున్న బాలయ్య ఆ అభిమాని నంబర్ తీసుకొని ఫోన్ చేశారు.

అధైర్యపడకుండా మందులు వాడుతూ ఫిజియోథెరపీ చేయించుకోమని బాలయ్య అభిమానికి చెప్పారు. ధైర్యంగా ఉంటే స్పీడ్ గా తిరిగి కోలుకోవచ్చని బాలయ్య అభిమానికి చెప్పారు. తక్షణ అవసరాల కోసం రూ.40 వేలు కూడా పంపించారు.

 

More

Related Stories