బాలయ్యకి చిరు అంబర్ ఫిట్టింగ్

బాలయ్యకి చిరు అంబర్ ఫిట్టింగ్


సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్లో నన్ను దూరం పెడుతున్నారు, నను ఇన్వైట్ చెయ్యట్లేదు అని నందమూరి బాలకృష్ణ మొన్న ఆ మధ్య కామెంట్ చేశారు. అది పెద్ద చర్చకు దారితీసింది. అప్పటివరకు యమా దూకుడు మీదున్న చిరంజీవి సైలెంట్ అయిపోయారు. సోషల్ మీడియాలో కూడా సైలెంట్. దాంతో … బాలకృష్ణదే అప్పర్ హ్యాండ్ అయింది అని నందమూరి అభిమానులు సంబరపడ్డారు.

కానీ చిరంజీవి సైలెంట్ కిల్లర్. బాలయ్యని ఎలా ఇరుకున పెట్టాలో ఆలా పెట్టారు. ఈ నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని కలిసి తెలుగు సినిమా చిత్రసీమ అభివృద్ధికి సాయం చెయ్యాలని అడగాలని చిత్రసీమ నిర్ణయించుకుంది. అందరితో పాటు మీరు రావాలని ప్రత్యేకంగా బాలకృష్ణని పిలిచారు. ఖంగు తినడం బాలయ్య వంతు అయింది. కక్కలేక మింగలేక ఉండిపోయే సీన్ ఇది.

బాలకృష్ణ … టీడీపీ ఎమ్మెల్యే. జగన్ దగ్గరికి వెళ్ళలేరు. అది కూడా గుంపులో గోవిందా టైపులో వెళ్లి జగన్ ని అభినందించడం, తమకు సాయం చెయ్యమని అడగడం అంటే ఎంత నామోషీ. అందుకే, జూన్ 10న తన 60వ బర్త్ డే సంబరాలు ఉన్నాయి అని రాలేనని చెప్పారు. ఈ విషయాన్నీ నిర్మాత సి కళ్యాణ్ బహిరంగంగా మీడియాకి చెప్పారు. మొన్నటి దాకా నాకు ఇన్విటేషన్ లేదు అని దుమారం రేపిన బాలయ్య ఇప్పుడు చిరంజీవి పెట్టిన అంబర్ ఫిట్టింగ్ కి విలలాలడుతున్నారు.

 

More

Related Stories