ఆ ఫన్-ఫ్రస్ట్రేషన్ బాలయ్యకు కూడా నచ్చింది

ఓ హీరో సినిమాను, మరో హీరో మెచ్చుకుంటే ఆ కిక్కు ఎప్పుడూ స్పెషల్ గా ఉంటుంది. ఎఫ్3 విషయంలో అదే జరిగింది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాను బాలకృష్ణ చూశారు. సినిమా చాలా బాగుందంటూ అందర్నీ మెచ్చుకున్నారు. బాలకృష్ణ కోసం ఎఫ్3 స్పెషల్ షో వేశాడు దర్శకుడు అనీల్ రావిపూడి.

సినిమా మొత్తం చూసిన బాలయ్య, అనీల్ రావిపూడి కామెడీ రైటింగ్ ను మెచ్చుకున్నారు. వెంకటేశ్, వరుణ్ చాలా బాగా చేశారని, దర్శక-నిర్మాతలతో తన ఆనందాన్ని పంచుకున్నారు. అంతకంటే ముందు హాస్యబ్రహ్మ బ్రహ్మానందంకు ఎఫ్3 సినిమాను ప్రత్యేకంగా చూపించారు. ఆద్యంతం సినిమాను ఎంజాయ్ చేశారు బ్రహ్మానందం.

F3

ఎఫ్3 తర్వాత బాలయ్యతోనే సినిమా చేయబోతున్నాడు రావిపూడి. జులై చివరి వారం లేదా ఆగస్ట్ లో సినిమా మొదలవుతుందని సమాచారం. ఎఫ్3 హంగామా ముగిసిన వెంటనే బాలయ్య సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడు ఈ దర్శకుడు. తండ్రి-కూతురు సెంటిమెంట్ తో వస్తోంది ఈ సినిమా. ఇందులో బాలయ్య-శ్రీలీల తండ్రికూతుళ్లుగా కనిపించబోతున్నారు.

 

More

Related Stories