డిక్టేటర్ కే ఓటేసిన బాలయ్య

Balakishna

నందమూరి బాలకృష్ణ ఏ దర్శకుడికి ప్రాధాన్యం ఇస్తాడో, ఏ నిర్మాతకు ఒకే చెప్తాడో ఎవరూ చెప్పలేరు. ఆయన నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. తాజాగా అలాంటి డెసిషన్ తీసుకున్నాడు బాలయ్య. ఫ్లాప్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన శ్రీవాస్ చెప్పిన కథకి ఓటేశాడట. రైటర్ కోన వెంకట్, శ్రీవాస్ కలిసి రెడీ చేసిన కథ బాలయ్యకి నచ్చిందట.

ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో ఆక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఇది పూర్తి అయ్యేలోపు అంతా రెడీ చేసుకోమని శ్రీవాస్ కి చెప్పాడట బాలయ్య. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో “డిక్టేటర్” అనే సినిమా వచ్చింది. అది పెద్దగా ఆడలేదు. కానీ బాలకృష్ణ అలాంటివి పట్టించుకోరు. కథ ఆయనకు నచ్చితే ఒకే చెప్పేస్తారు.

అలా “లక్ష్యం” శ్రీవాస్ ఇటీవల డిక్టేటర్, సాక్ష్యం వంటి ప్లాప్ లు ఇచ్చినా మరో అవకాశాన్ని పొందాడు.

Advertisement
 

More

Related Stories