ట్విట్టర్ కి బాలయ్య నో

నందమూరి బాలకృష్ణ పేరు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. దాంతో, ఆయనని ట్విట్టర్ లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. ‘అఖండ’ వంటి సంచలన హిట్ తో పాటు టాక్ షో హోస్ట్ గా పాపులారిటీ వచ్చాక బాలయ్యకి సోషల్ మీడియాలో కూడా క్రేజ్ పెరిగింది.

ఒకప్పుడు బాలయ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ అయ్యేది. ఇప్పుడు అది లేదు. అందుకే, ట్విట్టర్ లో వస్తే బాలయ్య వేసే పొలిటికల్ పంచ్ లకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది అనేది ఆయన అభిమానుల ఫీలింగ్. కానీ ఈ నందమూరి సీనియర్ హీరో ఒప్పుకోలేదట. ట్విట్టర్ లోకి అడుగుపెట్టే ఆలోచన, ఆసక్తి లేవని క్లారిటీ ఇచ్చాడట.

ప్రస్తుతం ఆయన పేరు మీద ఒక ఫేస్ బుక్ ఖాతా ఉంది. అధికారిక ఖాతానే. కానీ, ఒక ఏజెన్సీ ఆయన తరఫున పోస్టులు పెడుతుంది.

బాలయ్య నటించిన ‘వీర సింహ రెడ్డి’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే, ఈ నెల 8న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన మరో సినిమా స్టార్ట్ చేస్తున్నారు.

Advertisement
 

More

Related Stories