ఖబర్దార్… బాలయ్య హెచ్చరిక

Balakrishna

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న కన్నీటి పర్యంతమైన సంఘటన రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఆంధ్రపదేశ్ అసెంబ్లీలో తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. చంద్రబాబుకి, ఆయన సతీమణి భువనేశ్వరికి మద్దతుగా మొత్తం కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యాన్ని సహించేది లేదని భువనేశ్వరి సోదరులు, సోదరీమణులు హెచ్చరించారు.

“మీ రాజకీయాలు మీరు చేసుకోండి. కుటుంబ సభ్యులను లాగితే ఊరుకోము. ఆడవాళ్ళ జోలికొస్తే చేతులు ముడుచుకొని కూర్చోని ఉంటామనుకుంటున్నారా? ఖబర్దార్, మెడలు వంచుతాం,” అంటూ బాలయ్య గట్టిగా మాట్లాడారు. తన సోదరి భువనేశ్వరికి, రాజకీయాలకు సంబంధం లేదన్నారు.

మరోవైపు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించింది. “బాలకృష్ణ అమాయక చక్రవర్తి. ఆయన బాబు ఏమి చెప్తే అది నమ్ముతారు,” అని మంత్రి పేర్ని నాని అన్నారు.

మరోవైపు, బాలయ్య ‘అఖండ’ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ వివాదం నేపథ్యంలో సినిమాకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని టాలీవుడ్ లెక్కలు వేస్తోంది.

Advertisement
 

More

Related Stories