గ్రౌండ్ ఫ్లోర్ పెరిగిందా డాడీ: మోక్షజ్ఞ

Balakrishna

హీరోయిన్ శ్రీలీలని పొగుడుతూ బాలయ్య చెప్పిన ఒక మాట ఇప్పుడు వైరల్ అయింది. “భగవంత్ కేసరి” సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. అక్కడ స్టేజ్ పై శ్రీలీలని బాలయ్య పొగిడారు. ఈ సినిమాలో ఆమె బాలయ్యకి కూతురు వరుసయ్యే అమ్మాయిగా నటించింది.

“శ్రీలీల నన్ను చిచ్చా (బాబాయ్) చిచ్చా అంటూ టార్చర్ పెట్టింది. నెక్ట్స్ సినిమాలో మనం హీరో, హీరోయిన్లుగా నటిద్దామని శ్రీలీలకు చెప్పాను. ఇలా శ్రీలీలతో అన్నాను అని మా ఇంట్లో మా భార్యకు, నా కొడుక్కి చెప్పాను. అంతే… మోక్షజ్ఞ ఘాటుగా రెస్పాండ్ అయ్యాడు. నేను హీరో కాబోతున్నాను. నువ్వు ఆవిడకు ఆఫర్ ఇస్తాను అంటారేంటి? నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని అన్నాడు,” అని అందరి నవ్వుల మధ్య చెప్పారు బాలయ్య.

ఒక తెలుగు అమ్మాయి గొప్ప స్థాయికి ఎదగడం బాగుంది అని శ్రీలీలని పొగిడారు. అలాగే తన కొడుకు హీరోగా రాబోతున్న విషయాన్నీ కూడా కన్ఫర్మ్ చేశారు.

“భగవంత్ కేసరి” ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories