‘అఖండ 2’ ప్రకటిస్తాం: బాలకృష్ణ

Balakrishna

నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అతిపెద్ద హిట్… అఖండ. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన మూడో మూవీ అది. మూడూ ఒకదాని మించి ఒకటి హిట్ అయ్యాయి. ప్రస్తుతం బాలకృష్ణ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు, బోయపాటి శ్రీను రామ్ హీరోగా ఒక సినిమా తీస్తున్నారు. మరి మళ్ళీ వీరి కాంబినేషన్ ఎప్పుడు సాధ్యమవుతుంది?

“త్వరలోనే ఉంటుంది. అఖండ 2 కూడా గురించి చర్చించాం. అన్నీ ఒక కొలిక్కి వచ్చాక ప్రకటిస్తాం,” అని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ‘అఖండ’ సినిమాని గోవాలో జరుగుతున్న ‘ఇఫి’లో ప్రదర్శించారు. గోవాకి వచ్చిన బాలకృష్ణ, బోయపాటి టీవీ5 ఛానెల్ తో ముచ్చటించారు. అక్కడ ఈ విషయాన్నీ చెప్పారు.

తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఆగిపోయింది అనే వార్తలను తోసిపుచ్చారు బాలయ్య. మోక్షజ్ఞ తప్పకుండా హీరోగా అడుగుపెడతాడు అని హింట్ ఇచ్చారు. “ఎపుడు ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పను. అంతా దైవేచ్ఛ,” అని సమాధానం ఇచ్చారు బాలయ్య.

నందమూరి బాలకృష్ణ వచ్చే నెలలో దర్శకుడు అనిల్ రావిపూడి తీసే కొత్త సినిమాలో నటిస్తారు.

Advertisement
 

More

Related Stories