
నందమూరి బాలకృష్ణ మరోసారి తన మాటలతో కలకలం రేపారు. ఈ సారి ఆయన కరోనా వ్యాధి గురించి చేసిన కామెంట్స్ సంచలనం కలిగించాయి. కరోనాకి ఇప్పటివరకు వ్యాక్సిన్ రాలేదు అన్న విషయం మనందరికీ తెలుసు. ఐతే, ప్రపంచవ్యాప్తంగా అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ ని వీలైనంత తొందర్లో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అవి ఫలిస్తాయో లేదో చెప్పలేం.
కానీ బాలయ్య మాత్రం ఇప్పుడు వాక్సిన్ లేదు, ఇకపై రాదు అన్నట్లుగా మాట్లాడారు.
“సెహరి” అనే చిన్న సినిమా ఫస్ట్ లుక్ ని బాలయ్య ఈ రోజు ఆవిష్కరించారు. “కరోనా ప్రస్తుతం అందర్నీ ఇబ్బంది పెడుతోంది. అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. కరోనాకుఇప్పటివరకు వ్యాక్సిన్ రాలేదు. ఇక ముందు వ్యాక్సిన్ రాదు… వస్తుందనే వార్తలు నిజం కాదు. కాబట్టి ప్రభుత్వాలు చెప్పే వాటిని ఫాలో అవండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకొండి,” అని అన్నారు.
బాలయ్య చెప్పిందాంట్లో నిజమే ఉంది. కాకపోతే, “ఇక పై వ్యాక్సిన్ రాదు,” అనడమే కరెక్ట్ కాదు. రాదు అని ఎవరైనా ఎలా చెప్పగలరు?