నందమూరి బాలకృష్ణకు కోవిడ్


మళ్ళీ కోవిడ్ కేసులు మొదలయ్యాయి. ఇది నాలుగో దశ. కరోనా విజృంభణ తగ్గిపోయింది అనుకుంటున్న తరుణంలో కోవిడ్ కేసులు మరోసారి నమోదు అవుతున్నాయి. తాజాగా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు కోవిడ్ వచ్చింది.

శుక్రవారం పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆయన ఇంట్లోనే ఐసోలేషన్‌కు వెళ్లారు. ”ఎలాంటి కోవిడ్ తీవ్ర లక్షణాలు లేవు. పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నా,” అని అన్నారు బాలకృష్ణ. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కోవిడ్ టెస్టు చేయించుకోవాలి అని కోరారు బాలయ్య.

రెండు రోజుల క్రితం బాలయ్య బసవతారకం యానివర్సరీ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోవిడ్ కారణంగా ఆయన సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది.

ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీలో నటిస్తున్నారు.

 

More

Related Stories