హిందూపురంలో బాలయ్య మరోసారి

Balakrishna

నందమూరి బాలకృష్ణ 2014లో మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019లో కూడా అదే సీటు నుంచి ఎన్నికయ్యారు.

పదేళ్లుగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు బాలయ్య. ఇక 2024లో మాత్రం నందమూరి బాలకృష్ణ పోటీలో ఉండకపోవచ్చని ఆ మధ్య కొన్ని మీడియాలలో వచ్చాయి. ఈసారికి ఆయన ఎన్నికల బరిలోకి దిగకుండా కేవలం పార్టీ తరఫున ప్రచారానికే పరిమితం అవుతారని ప్రచారం జరిగింది. కానీ అవి పుకార్లు అనే తేలింది ఇప్పుడు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రకటించారు. ఆ లిస్ట్ లో బాలయ్య పేరు ఉంది. హిందూపురం నుంచి ముచ్చటగా మూడోసారి బాలయ్యనే పోటీ చేస్తారని వెల్లడించారు.

సో, బాలయ్య ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారని భావించొచ్చు. ఈ నియోజకవర్గం ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983 నుంచి ఇక్కడ వేరే పార్టీ అభ్యర్థి గెలవలేదు మరి. సో ఆ విధంగా చొస్తే నందమూరి బాలకృష్ణ గెలుపు సులువే.

Advertisement
 

More

Related Stories