మంచు విష్ణుకి బాలయ్య మద్దతు!

- Advertisement -
Nandamuri Balakrishna

‘మా’ ఎన్నికల రగడ మళ్ళీ మొదలైంది. ఒక వారం సైలెంట్ గా గడిచింది. ఇప్పుడు బాలయ్య ఒక టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంతో మళ్ళీ ఎన్నికలపై చూపు పడింది.

“సినిమా పరిశ్రమ సమస్యలను బహిరంగంగా చర్చించకూడదని,” హితవు పలికిన నందమూరి బాలకృష్ణ ఆ ఇంటర్వ్యూలో ఈ కింది అభిప్రాయాలను వెల్లడించారు.

  • ‘మా’లో లోకల్, నాన్ లోకల్ లేదు.
  • గతంలో ‘మా’ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు అంటూ విదేశాలకు వెళ్లారు. విమానాల్లో తిరిగారు. ఆ డబ్బులు ఏమయ్యాయి?
  • తెలంగాణ ప్రభుత్వంతో రాసుకు, పూసుకు తిరుగుతున్నారు. మరి “మా” భవనం కోసం ఒక్క ఎకరం భూమి తెచ్చుకోలేకపోయారా?
  • ‘మా’ భవనం కోసం మంచు విష్ణు ముందుకొస్తే… అందులో భాగస్వామినవుతా…

నందమూరి బాలకృష్ణ తాజా వ్యాఖ్యలతో సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ హీట్ పెరిగింది.

‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు, ప్రకాష్ రాజా మధ్య పోటీ ఉంది. చిరంజీవి వర్గం ప్రకాష్ రాజ్ వైపు నిలిచింది. దాంతో, బాలయ్య రంగంలోకి దిగి విష్ణుకి సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఐతే, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఇంకా తేలలేదు.

 

More

Related Stories