
ఈ సారి దసరాకి మూడు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. అందులో డైరెక్ట్ ఫైట్… నందమూరి బాలకృష్ణ, తమిళ్ సూపర్ స్టార్ విజయ్ మధ్యే ఉంటుంది. బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తీస్తున్న “భగవంత్ కేసరి” చిత్రం రిలీజ్ డేట్ ని నిర్మాతలు తాజాగా ప్రకటించారు. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.
ఇక అదే రోజు విజయ్ హీరోగా నటిస్తున్న “లియో” సినిమా రానుంది. అక్టోబర్ 19 తమ విడుదల తేదీ అని “లియో” మేకర్స్ ఇంతకుముందే ప్రకటించారు.
ఇంతకుముందు దసరా బరిలో “భగవంత్ కేసరి”, “స్కంద”, “లియో”, “టైగర్ నాగేశ్వరరావు” పోటీలో ఉన్నాయి. కానీ, రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న “స్కంద” రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ కి మార్చుకొంది. ఇక రవితేజ హీరోగా రూపొందుతోన్న “టైగర్ నాగేశ్వర రావు” అక్టోబర్ 20ని లాక్ చేసుకొంది. దాంతో, “భగవంత్ కేసరి” అక్టోబర్ 19ని ఫిక్స్ చేసుకొంది.
విజయ్ నటిస్తున్న “లియో” సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకుడు. అతని సినిమాలన్నీ తెలుగులో పెద్ద హిట్ అయ్యాయి. యువతలో లోకేష్ కి మంచి క్రేజుంది.
సో, “లియో” సినిమాని తక్కువ అంచనా వెయ్యలేం. కాకపోతే, బాలయ్య ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు. వరుసగా పెద్ద హిట్స్ కొడుతున్నారు. సో, భగవంత్ కేసరి”కి ఎక్కువ థియేటర్స్ దక్కుతాయి.