చిన్న మనవడితో బాలయ్య ఫోజు

Balakrishna with grandson Aryaveer

నందమూరి బాలకృష్ణకి ఇద్దరు మనవళ్లు. నారా లోకేష్, బ్రాహ్మణిల కొడుకు దేవాన్ష్ గురించి అందరికి తెలుసు. ఆయన రెండో కూతురు తేజస్వినికి కూడా రెండేళ్ల క్రితం అబ్బాయి పుట్టాడు. ఆ బాబు పేరు.. ఆర్యవీర్. ఈ చిన్న మనవడిని ఇప్పుడు తన షూటింగులకు తీసుకెళ్తున్నాడు బాలయ్య.

ఆర్యవీర్ తో కలిసి దిగిన ఆ ఫోటో అలాంటి సందర్భంలోనిదే.

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి తీస్తున్న కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన సాయేషా, పూర్ణ హీరోయిన్స్ గా కన్ ఫమ్ అయ్యారు. ఈ మూవీ తర్వాత ఏంటి అనేది ఇంకా నిర్ణయించుకోలేదు బాలయ్య. ఇకపై ఏడాదికి ఒక సినిమా మాత్రమే చెయ్యాలనుకుంటున్నాడట.

Related Stories