బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా?


తెలుగు భామ ప్రియాంక జవాల్కర్ కి బంపర్ ఆఫర్ దక్కింది. కానీ, ఆమెకి ఇంకా టెన్షన్ పోవడం లేదు. ఇప్పటివరకు పెద్ద హీరో సరసన నటించని ఈ భామకి ఏకంగా బాలయ్యతో జతకట్టే ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఇచ్చాడు.

బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా ఇటీవలే ప్రారంభం అయింది. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఇక బాలయ్య సరసన నటించేందుకు ప్రియాంక జవల్కర్ ని అడిగాడు అనిల్ రావిపూడి. అంతే కాదు, ఆమెపై ఒక ఫోటోషూట్ కూడా చేశారు. ఐతే, ఇప్పటివరకు ఆమె పేరుని ప్రకటించలేదు.

బాలయ్య ఓకే చెప్తే కానీ దర్శకుడు కానీ, నిర్మాత కానీ ప్రకటించేందుకు వీలు లేదు. మరి బాలయ్య ఇంకా భామని తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదంట. అందుకే, ఇప్పటివరకు ఆమె పేరుని అనౌన్స్ చెయ్యలేదు. అందుకే ఛాన్స్ వచ్చినా ఆమెకి టెన్షన్ వీడలేదు.

అనంతపూర్ కి చెందిన ప్రియాంక ‘టాక్సీవాలా’ సినిమాతో పాపులర్ అయింది. ఆ తర్వాత ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ అనే హిట్ సినిమాలోనూ నటించింది. రెండు హిట్స్ ఉన్నా ఆమెకి పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో ఇటీవల అందాలు ఆరబోస్తూ ఫోటోలు పెడుతోంది. పై ఫోటో ఆమె కొత్త ఫోటోషూట్ నుంచి తీసుకున్నదే. ఈ ఫోటో షూట్ ల వల్లే కాబోలు ఆమెకి బాలయ్య సరసన నటించే ఛాన్స్ వచ్చింది.

 

More

Related Stories