ఇంకోసారి ‘సీమ’ నేపథ్యమే!

NBK107


సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ రాయలసీమ నేపథ్యంలో సాగే కథలకు బాక్సాఫీస్ ఊపు ఉంటుందని ప్రూవ్ చేశారు. ఆయన నటించిన అనేక చిత్రాల రాయలసీమ నేపథ్యంగా సాగినవే. ‘సమరసింహరెడ్డి’, ‘నరసింహ నాయుడు’ నుంచి ఇటీవల వచ్చిన ‘అఖండ’ వరకు సీమ బ్యాక్డ్రాప్ కనిపిస్తుంది.

తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం కోసం కొంత భాగాన్ని కర్నూలులో చిత్రీకరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో బాలయ్య షూటింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో బాలయ్య ‘నరసింహ నాయుడు’ తరహా లుక్కులో కనిపిస్తున్నారు. దాంతో, అభిమానులు ఈ ఫోటోలకి తెగ లైక్ కొడుతున్నారు.

ఐతే, పాత ఫ్యాక్షన్ సినిమాల్లా కాకుండా ‘అఖండ’, ‘క్రాక్’ తరహాలో కొత్త మాస్ సీన్లు ఉంటాయట ఈ మూవీలో. బాలయ్య తన వయసుకు తగ్గ రీతిలోనే ఈ సినిమాలో గెటప్ సెట్ చేసుకున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి దర్శకుడు గోపీచంద్ మలినేని. ‘జై బాలయ్య’ అనే పేరు పరిశీలనలో ఉంది.

ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యకే బాలయ్య దర్శకుడు అనిల్ రావిపూడి తీసే సినిమా షూటింగ్ షురూ చేస్తారు.

 

More

Related Stories