ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా!

- Advertisement -
Balakrishna

నందమూరి బాలకృష్ణ జిల్లా కోసం ఉద్యమం మొదలుపెట్టారు. ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నగరాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్ నెరవేరకపోతే రాజీనామా చేస్తాను అని అంటున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను విడదీస్తూ 26 జిల్లాలుగా మార్చింది. అనంతపురం జిల్లాని విడగొట్టి కొత్తగా శ్రీస‌త్య‌సాయి జిల్లాని ఏర్పాటు చేశారు. ఐతే, జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని చెయ్యడంతో వివాదం మొదలైంది. హిందూపురం పెద్ద నగరం. ఆ జిల్లాకి కేంద్రంగా కావాల్సిన అన్ని వసతులు, హంగులు ఉన్నాయి. కాబట్టి హిందూపురం నగరాన్ని జిల్లా కేంద్రంగా చెయ్యాలని బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టారు.

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌క‌పోతే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని బాలయ్య సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

బాలయ్య ఇక్కడి నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

 

More

Related Stories