అమెరికాలో బాలయ్య జోరు

Veera Simha Reddy


ఒకప్పుడు బాలయ్య్య సినిమాలు మాస్ సెంటర్లోనే ఎక్కువగా ఆడేవి. అమెరికాలో బాలయ్య చిత్రాలకు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. అమెరికాలో ఎక్కువగా క్లాస్ సినిమాలు ఆడేవి. కానీ, ఇటీవల ఆ ట్రెండ్ మారింది. అక్కడ మాస్ చిత్రాలకు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. పైగా, బాలయ్య సినిమాలు కూడా మిలియన్ డాలర్ల వసూళ్లు సులువుగానే సంపాదిస్తున్నాయి.

గతేడాది (2021) ‘అఖండ’ పెద్ద హిట్ అయింది. ఇక ఇప్పుడు సంక్రాంతికి బాలయ్య సందడి మామూలుగా ఉండేలా లేదు. ప్రస్తుతం అడ్వాన్స్ టికెట్ ట్రెండ్ ని బట్టి చూస్తే ‘వీర సింహ రెడ్డి’కే ఎక్కువగా టికెట్లు తెగుతున్నాయి. అమెరికా తెలుగోళ్లు బాలయ్య సినిమాపై అంత ఆసక్తి చూపుతున్నారట. ఈ సంక్రాంతి (2023)కి వీర సింహ రెడ్డి, వాల్తేర్ వీరయ్య, తెగింపు, వారసుడు చిత్రాలు బరిలో ఉన్నాయి. ఐతే, ప్రస్తుతానికి బాలయ్య సినిమాకే ట్రెండ్ బాగా ఉంది. మిగతా సినిమాలు ఇంకా బాలయ్య సినిమా రేంజులో అందుకోవాలి.

బాలయ్య గ్రాఫ్ ఇటీవల మారింది. ‘అన్ స్టాపబుల్’ షో హిట్ కావడం, అయన నటన ‘అఖండ’లో కొత్తగా కనిపించడంతో బాలయ్యకి మళ్ళీ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ చిత్రాల అపజయాలు మర్చిపోయేలా చేశాయి తాజా పరిణామాలు.

మరి, ‘వీర సింహ రెడ్డి’ అమెరికాలో ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.

 

More

Related Stories