ఇక బాలయ్య ప్రకటన

- Advertisement -
Balakrishna in BB3

నందమూరి బాలకృష్ణ, బోయపాటి సినిమా గురించే ఊసే ఉండడం లేదు. అన్ని సినిమాల గురించి ప్రకటనలు వస్తున్నా… బాలయ్యది మౌనమే. ఐతే, రేసులో వెనుకబడ్డామని గ్రహించిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు హడావిడిగా తన సినిమా పోస్టర్ రెడీ చేయిస్తున్నాడు.

ఈ సినిమా టైటిల్, దాంతో పాటు రిలీజ్ డేట్ కూడా వదులుతారట.

బాలకృష్ణ ఈ సినిమాలో అఘోర పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే చాలా షూటింగ్ పూర్తి అయింది. ఐతే, ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే అచ్చం “లెజెండ్” సినిమాలా ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది.

“లెజెండ్ కి, దీనికి పోలికల్లేవు. కథ మొత్తం నాకు బోయపాటి చెప్పలేదు కానీ నా క్యారక్టర్ డిఫరెంట్. లెజెండ్ కి సంబంధం లేదు,” అని బాలయ్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బాలకృష్ణ సరసన పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.

 

More

Related Stories