బాలయ్య హోళీ ఫోటో వైరల్

Balayya


నందమూరి బాలకృష్ణకి కోపం ఎక్కువ. చిరాకు, పరాకు కూడా ఓవర్ గానే ఉంటుంది. ఐతే, ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అంటారు బాగా తెలిసినవాళ్ళు. చుట్టూ ఉన్నోళ్లు ఏమనుకుంటారు అనేది పట్టించుకోరు … తనకి నచ్చిన పని చేసుకుంటూ పోతారు. చిన్న పిల్లలతో చిన్నవాడిగా మారిపోతారు. తన మనవాళ్లతో కూడా సరదాగా ఆడుకుంటారు బాలయ్య.

అలాంటిదే ఈ ఫోటో. మొన్న హోళీ సందర్భంగా ఆయన పిల్లలతో ఆడుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో బాలయ్య తన కొత్త సినిమా గెటప్పులోనే ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మూవీ షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమాకి ‘మోనార్క్’, ‘గాడ్ ఫాదర్’ టైటిల్స్ తో పాటు మరో టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఒక సంస్కృత శ్లోకంలోని పదాన్ని టైటిల్ గా పెడితే ఎలా ఉంటుందనేది ఆలోచన. ఉగాదికి సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారు.

More

Related Stories