దసరాకి బాలయ్య నర్తనశాల

ఓ 16 ఏళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ “నర్తనశాల” రీమేక్ తీయాలని ప్రయత్నించారు. తన డైరెక్షన్లోనే ఘనంగా ఆ సినిమా ప్రారంభమైంది. సౌందర్య ద్రౌపది పాత్రలో నటించింది. ఐతే ఒక షెడ్యూల్ తర్వాత ఆ సినిమా ఆగిపొయింది. అలాగే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించారు. అలా … “నర్తనశాల” పూర్తికాలేదు.

ఐతే, ఆ మొదటి షెడ్యూలులో చిత్రీకరించిన సీన్లని ఇప్పడు ఏటిటిలో విడుదల చెయ్యనున్నారు. ఈ దసరాకె విడుదల కానుంది.

“నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. అర్జునుడిగా నేను, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తాము. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోంది,” అంది బాలకృష్ణ తన ఫేస్ బుక్ లో అప్డేట్ చేశారు

Related Stories