బాలయ్య మాటే చెల్లింది!


సంక్రాంతి బరిలో ఉండాలని నందమూరి బాలకృష్ణ పట్టుబట్టారు. కానీ, నిర్మాతలు ముందు ఒప్పుకోలేదు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒకేసారి ఇటు బాలయ్యతో, అటు చిరంజీవితో సినిమాలు నిర్మిస్తోంది. ఆ సంస్థ ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం దసరాకి బాలయ్య చిత్రం, సంక్రాంతికి చిరంజీవి చిత్రం విడుదల చెయ్యాలి.

ఐతే బాలయ్య నటిస్తున్న ‘వీర సింహ రెడ్డి’ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. దాంతో, దసరా బదులు ‘అఖండ’ విడుదలైనట్లు డిసెంబర్ లో చేద్దామని నిర్మాతలు ఆలోచించారు. ఎందుకంటే, చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆర్నెల్ల క్రితమే ప్రకటించారు.

కానీ, ‘వీర సింహ రెడ్డి’ షూటింగ్ ఆలస్యం అవుతున్న కొద్దీ బాలయ్య ఆలోచన మారింది. డిసెంబర్ 23కి రిలీజ్ చేసే బదలు సంక్రాంతికి ఎందుకు విడుదల చెయ్యకూడదు అని బాలయ్య నిర్మాతలను అడిగారు. వాళ్ళు, చిరంజీవి సినిమా ఉంది అని సమాధానం ఇచ్చారు. కానీ, బాలయ్య పట్టుదల పెరిగింది. చిరంజీవి కోసం తను ఎందుకు వెనుకడుగు వెయ్యాలని అనుకున్నారేమో ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చెయ్యండి అని బాలయ్య హుకుం జారీ చేశారు.

బాలయ్య ఆర్డర్ వేసిన తర్వాత నో చెప్పే సాహసం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ చెయ్యరు. మైత్రి మేకర్స్ కి ముందే భయం. బాలయ్య మాటకే ఓటేశారు. సో, ఇప్పుడు రెండూ సినిమాలను సంక్రాంతి బరిలో నిలపనున్నారు.

 

More

Related Stories