బాలయ్య, బోయ మూవీకి నిర్మాత మార్పు?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను… ఈ కాంబినేషన్ వెరీ స్పెషల్. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలూ సూపర్ హిట్. ఇప్పుడు నాలుగో చిత్రం రాబోతోంది.

బోయపాటితో ఒక పెద్ద సినిమా తీయబోతున్నట్లు ఆ మధ్య ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఆ పెద్ద సినిమా అల్లు అర్జున్ హీరోగా అని మొదట అనుకున్నారు. కానీ ఆ తర్వాత క్లారిటీ వచ్చింది బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో మూవీ అని. అది కూడా “అఖండ 2″ని ప్లాన్ చేస్తున్నారు అని అర్థమైంది. ఐతే, ఇప్పుడు ఈ సినిమాకి నిర్మాత మారే అవకాశం కనిపిస్తోంది.

బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో రూపొందే నాలుగో సినిమాని “అఖండ” నిర్మాతతో కలిసి “లెజెండ్” చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తారు అనే టాక్ వినిపిస్తోంది. అల్లు అరవింద్ తీయాలన్న ప్లాన్ వర్కవుట్ అయ్యేలా లేదు.

ఐతే బాలయ్యతో తమ బ్యానర్ లో తప్పకుండా సినిమా ఉంటుంది అని గీతా ఆర్ట్స్ సంస్థ అంటోంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా ఎన్నికల తర్వాత ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. మరోవైపు, “లెజెండ్” విడుదలై 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమా 10 ఏళ్ల వేడుకలు గురువారం (మార్చి 28) ఘనంగా జరిగాయి.

Advertisement
 

More

Related Stories