
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని నిరసిస్తూ నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబుని ఎలాగైనా జైల్లో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కుట్రపన్నారు అని బాలయ్య ఆరోపించారు.
బాలయ్య, చంద్రబాబు కుటుంబం మొత్తం ఇప్పుడు విజయవాడలో ఉంది. “భగవంత్ కేసరి” షూటింగ్ ని కొద్ది రోజుల పాటు నిలిపివేశారు.
ఇక, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం రాత్రే విజయవాడ పయనమయ్యారు. పోలీసులు పవన్ కళ్యాణ్ ని విజయవాడలో అడుగుపెట్టకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారు. కానీ జనసేన అభిమానుల సందోహంతో పవన్ కళ్యాణ్ మంగళగిరి చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ ఆగింది. పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ వచ్చాక మళ్ళీ షూటింగ్ మొదలవుతుంది.