
నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షో హోస్ట్ గా సక్సెస్ కావడం వెనుక చాలా మంది కృషి ఉంది. దాని మొదటి ప్రోమోలు డైరెక్ట్ చేసింది యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. అప్పటి నుంచి బాలయ్యతో ప్రశాంత్ వర్మకి మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే, బాలయ్య ప్రశాంత్ కి ఒక ఛాన్స్ ఇచ్చారు.
ప్రశాంత్ వర్మ తాజాగా “హను మాన్” అనే చిత్రం తీశారు. అది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్య సినిమా స్క్రిప్ట్ పై కూర్చుంటాడట.
“అవును.. బాలయ్య గారి సినిమా కన్ఫిర్మ్ అయింది. ఇప్పటివరకు బాలయ్యని ఏ దర్శకుడు చూపని పద్దతిలో చూపిస్తా. బాలయ్య సినిమా కెరీర్ లో అదొక మంచి చిత్రంగా నిలుస్తుంది,” అని ప్రశాంత్ అంటున్నారు.
“భైరవద్వీపం, ఆదిత్య 369 చిత్రాలకు బాలయ్య కెరీర్ లో ఎలాంటి ప్రత్యేకత ఉందో నా సినిమాకి కూడా అలాంటి యూనిక్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది,” అని ప్రశాంత్ మరింత సమాచారం బయటపెట్టారు. బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బాబీ తీస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.