హోమ్ లోన్…బాలయ్య బాబు సైక్లోన్!

Balakrishna


“కోకా కోలా పెప్సీ మా బాలయ్య బాబు సెక్సీ” అని అభిమానులు అల్లరి చెయ్యడం గతంలో చూశాం. ‘అఖండ’ సినిమా ప్రొమోషన్ లో భాగంగా జరుగుతున్న ఇంటర్వ్యూలలో సంగీత దర్శకుడు తమన్ మరికొన్ని ఇలాంటి కొటేషన్లను చదివి వినిపించాడు బాలకృష్ణ సమక్షంలో. అభిమానులు తనకు ట్విట్టర్లో ట్యాగ్ చేసిన ఈ కొటేషన్లను బాలయ్యకి చెప్పాడు. డజన్ కి పైగా ఉన్న ఈ లైన్లని చదివాడు తమన్.

అవి విన్న బాలయ్య ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. “నా అభిమానుల్లో చాలా మంది పేదవాళ్ళు. కానీ వారు తమ సమయాన్ని ఇలా నా కోసం వెచ్చిస్తారు. ఆ దేవుడి నాకిచ్చిన వరం నా అభిమానులు,” అని బాలయ్య అన్నారు.

ఇంతకీ తమన్ కొత్తగా చదివిన ఆ లైన్లు ఏంటో చూద్దాం….

హౌస్ లోన్ పర్సనల్ లోన్…. బాలయ్య బాబు సైక్లోన్

బెండకాయ దొండకాయ… బాలయ్య బాబు మా గుండెకాయ

మినపట్టు పెసరట్టు … బాలయ్య బాబు తొడకొట్టు

వానోస్తే కరెంట్ కోత… బాలయ్య బాబు గుండెల్లో మోత

పసిఫిక్ చాలా డీపు… మా బాలయ్య తోపు

Advertisement
 

More

Related Stories