షూటింగ్ తో బాలయ్య బిజీ

NBK109

నందమూరి బాలకృష్ణ మరోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఆయన అక్కడి నుంచి గెలిచారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. బాలయ్య అక్కడికి వెళ్లి ప్రచారం చెయ్యకపోయినా గెలుస్తారు. అందుకే, బాలకృష్ణ ఇంకా హైదరాబాద్ లోనే ఉంటూ షూటింగ్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా #NBK109 షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించి ఒక యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు. ఈ షూటింగ్ లో బాలయ్య పాల్గొంటున్నారు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, బాలయ్య తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. ఎక్కడెక్కడ బాలయ్య ప్రచారానికి వెళ్ళాలి అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. అందుకే, అప్పటివరకు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలి అని భావిస్తున్నారు. ఆ తర్వాత ఒక నెల రోజుల పాటు షూటింగ్ కి గ్యాప్ ఇస్తారు.

మరోవైపు, బాలయ్య, దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో రూపొందే కొత్త సినిమా ఎన్నికల ఫలితాల తర్వాత మొదలవుతుంది.

Advertisement
 

More

Related Stories