నిర్మాతలపై కసురుకున్న బాలయ్య


నందమూరి బాలకృష్ణ స్పీడ్ గా షూటింగ్ లు చేస్తూ మిగతా హీరోలకు ఆదర్శంగా నిలిచారు. గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ లు చెయ్యాలి అనేది ఆయన పాలసీ. అలాంటి హీరో షూటింగ్ పెట్టుకుందామా అని అడిగిన నిర్మాతలపై కసురుకున్నాడట. కొత్త షెడ్యూల్ ఎప్పుడు పెడదామని అని అడిగిన నిర్మాతలకు ‘తొందరేముంది’ అని క్లాస్ పీకాడట.

ఐతే, దీనికి ఒక రీజన్ ఉంది. బాలయ్య ప్రస్తుతం తన సోదరుడి కొడుకు హీరో తారకరత్న ఆరోగ్యం గురించి వర్రీ అవుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తారకరత్న గురించి ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నారు బాలయ్య. అందుకే, ఇప్పుడిప్పుడే షూటింగ్ లు వద్దని క్యాన్సిల్ చేసుకున్నారు.

ఫిబ్రవరి మొదటి వారం నుంచి అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో పాల్గొనాలి బాలయ్య. ఆ ప్రకారం వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ బాలయ్య మాత్రం ఇప్పుడే షూటింగ్ వద్దు, నెలాఖరు వరకు ఆగండి అని చెప్పాడట. దాంతో, ఈ సినిమా పనులు ఆగాయి.

ఇందులో బాలయ్య సరసన కాజల్ నటించనుంది. ఇక ఇప్పుడు కుర్రకారును ఆకట్టుకుంటున్న శ్రీలీల బాలయ్యకి కూతురిగా నటించనుంది.

Advertisement
 

More

Related Stories