బాలయ్యదే పైచేయి

Balakrishna


సంక్రాంతి బరిలో ముందుగా రానున్న సినిమా… వీర సింహ రెడ్డి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి డేట్ ఫిక్స్ అయింది. జనవరి 12, 2023న రానుంది ‘వీర సింహ రెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’ ఒక రోజు లేట్ గా విడుదల అవుతుంది.

నిజానికి ‘వీరసింహ రెడ్డి’ డిసెంబర్ లో విడుదల కావాలి. కానీ, బాలయ్య నిర్మాతలకు హుకుం జారీ చేశారు తన సినిమాని సంక్రాంతి బరిలో నిలపమని. బాలయ్య మాటని కాదనలేక సంక్రాంతికి మార్చారు ఈ సినిమా విడుదలని. ఇప్పుడు పండగ సీజన్ లో కూడా తనదే ముందు విడుదల అయ్యేలా చేసుకున్నారు. దటీజ్ బాలయ్య.

బాలకృష్ణ మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేదు. నిర్మాతలే కాదు ఇతర హీరోలు కూడా బాలయ్యకి ఎదురెళ్లేందుకు భయపడతారు అని మరోసారి ప్రూవ్ అయింది.

పైగా, బాలయ్య ఇప్పుడు మంచి ఊపు మీదున్నారు. ఆయన నటించిన ‘అఖండ’ సంచలన విజయం సాధించింది. ఆ విధంగా ఈ సినిమాకే ట్రేడ్ వర్గాల్లో క్రేజు ఉంది.

Advertisement
 

More

Related Stories