
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తన సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ప్రకటించారు హీరో నందమూరి బాలకృష్ణ. ఆదివారం నుంచి పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను మళ్ళీ మొదలుపెడుతున్నారు.
కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభం అవుతుంది. సో, పవన్ కళ్యాణ్ యాత్రకి తమ పార్టీ తరఫున, తన తరఫున ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని అంటున్నారు బాలయ్య.
వచ్చే ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి చెందిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చెయ్యబోతున్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రకటించారు. అందుకే, బాలయ్య పవన్ కళ్యాణ్ యాత్రకు సపోర్ట్ ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ తాజాగా “ఉస్తాద్ భగత్ సింగ్”కి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. బాలయ్య తన “భగవంత్ కేసరి” సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు.
Advertisement