క్షమాపణలు చెప్పిన బాలయ్య

హీరో నందమూరి బాలకృష్ణ ఒక విషయంలో తప్పుగా మాట్లాడారు. దాంతో, క్షమాపణలు చెప్పారు ఇపుడు. “వీర సింహా రెడ్డి” ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అంటూ వ్యాఖ్యానించారు బాలయ్య. దాంతో ఆ వర్గం వారు బాలయ్యని నిలదీశారు. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని ఏ పురాణంలో ఉందో చెప్పాలని వారు ప్రశ్నించారు.

దాంతో, బాలయ్య ఎటువంటి భేషజాలకు పోకుండా వివరణ ఇచ్చారు. తన తప్పుని సరిదిద్దుకున్నారు.

“దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికి కృతజ్ఞతలు. నా మాటల వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు. దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే. దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు. నావాళ్లను నేను బాధపెట్టుకుంటానా ? పొరపాటును క్షమిస్తారని ఆశిస్తున్నాను,” అంటూ బాలయ్య లెటర్ రాశారు.

బాలయ్య నటించిన ‘వీర సింహా రెడ్డి’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది.

Advertisement
 

More

Related Stories