ఎన్ని సార్లు ఈ సారీలు

Nandamuri Balakrishna


నందమూరి బాలకృష్ణ మాట తూలడం కొత్త కాదు. కానీ, ఇటీవల ఆయన మాటలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి వివాదం చిలికి చిలికి పెద్దదిగా మారుతోంది. దాంతో బాలయ్య స్పందించక తప్పడం లేదు.

తాజాగా ఆసుపత్రిల్లో పనిచేసే నర్సుల మనోభావాలు దెబ్బతిన్నాయి బాలయ్య మాటల వల్ల. ఒక నర్సు అందాల గురించి బాలయ్య చేసిన కామెంట్స్ తో రాజకీయ వివాదం మొదలైంది. దాంతో, ఆయన సారీ కాని సారీ చెప్పారు. “నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నా”ను అని బాలయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే, పూర్తిగా సారీ కూడా చెప్పలేదు. కేవలం

ఒకసారి యాక్సిడెంట్ జరిగితే బాలయ్య ఆసుపత్రిలో చేరేందుకు వెళ్ళాడట. కానీ, యాక్సిడెంట్ లో గాయపడినట్లుగా ఆసుపత్రిలో చెప్పొద్దని సలహా ఇచ్చారట. అబద్దం ఆడమని చెప్పారట. ఐతే,బాలయ్య అక్కడ ఉన్న నర్స్ అందాలకు ఫిదా అయిపోయి నిజం చెప్పేశాడట. ఈ క్రమంలో ఆయన వాడిన పదాలు “దీనమ్మ అది భలే ఉంది…. “

దాంతో నర్సులు బాలయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో, బాలయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా వివాదం రేగినప్పుడల్లా తన ఇంటెన్షన్ అది కాదు అంటూ ఇలాంటి ఒక స్టేట్మెంట్ వదులుతున్నారు. అందులోనూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడం లేదు. “ఒకవేళ మీరు బాధపడితే” అని ఒక మెలిక పెడుతున్నారు.

 

More

Related Stories