వాళ్ళ రూట్లోకే బాలయ్య

బాలయ్య ఇప్పుడు తనదైన సినిమాలు చెయ్యడం కన్నా… డైరక్టర్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారట. బోయపాటి తీస్తున్న ‘అఖండ’ కథ పూర్తిగా వినకుండానే ఒప్పుకున్నారు బాలయ్య. ఎందుకంటే.. బోయపాటి స్టైల్ ఏంటో బాలయ్యకి తెలుసు. అలాగే, నందమూరి బాలకృష్ణ రెండు సినిమాలు చెయ్యబోతున్నారు.

ఒకటి… ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని తీసే మూవీ. రెండోది అనిల్ రావిపూడి డైరెక్షన్లో (ఐతే ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఆఫీసియల్ గా ప్రకటన రాలేదు). ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన స్టయిల్ ని కలిగిన దర్శకులే. గోపీచంద్ ది పాత మసాలా ఎలిమెంట్స్ నే కొత్తగా పోపు పెట్టి మెప్పించే రకం. అనిల్ రావిపూడిది పూర్తిగా కామెడీ పంథా.ఇద్దరిలో కొత్తదనం ఉండదు. కానీ జనాలని మెప్పించేలా తీస్తారు. సో, వారి స్టైల్ కే సరెండర్ అవ్వాలనుకుంటున్నాడట బాలయ్య.

ముందుగా గోపీచంద్ మలినేని సినిమా మొదలవుతుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

More

Related Stories