- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై హీరో నందమూరి బాలకృష్ణ ఘాటైన విమర్శలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో అంతిమంగా ధర్మమే గెలుస్తుందని ఆయన అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకున్నా చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. కక్ష సాధించడమే సీఎం జగన్ లక్ష్యమని అన్నారు.
ఇక జగన్ పై ఆయన తనదైన శైలిలో ఒక పద్యం చదివారు.
“ఇక మన ముఖ్యమంత్రి… ఆయన గురించి చెప్పక్కర్లే… లక్షల కోట్ల భక్షక … అవినీతి అర్భక, పక్షపాత రూపక …. కంత్రి మహా మూర్క, ముష్టి మూచ ముదనష్టక…. అలాగే జగమెరిగిన జగన్నాటక… ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక… రాష్ట్రానికి పట్టిన రావణ పాలక… జనధనమాన చోరక…” అంటూ బాలయ్య పద్యం సాగింది.
ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.