
పవన్ కళ్యాణ్ వీరుడు, శూరుడు, పవన సూతుడు అంటూ పొగడ్తల దండకం చదివాడు నిర్మాత బండ్ల గణేష్ మొన్న జరిగిన వకీల్ సాబ్ ఈవెంట్ లో. హీరోలని అందరూ పొగుడుతారు. కానీ బండ్ల తీరు వేరు. తమిళోల్లు ఎక్కువ యూజ్ చేసే మాటల్లో చెప్పాలంటే… ‘వేరా లెవల్’. పవన్ కళ్యాణ్ ని పొగడడంలో బండ్లకి పోటీ ఇచ్చేవారు లేరు.
ఐతే, ఇది నిజంగా భక్తి అని అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ అంటే అంత భక్తి ఉన్నవాడు… మరి 2018లో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాడు? జనసేన సభ్యత్వం ఎందుకు తీసుకోలేదు? అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందనే భ్రమలో అటు వెళ్ళాడు. తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయి.. మళ్లీ తనకు తెలిసిన విద్యే బెటర్ అనుకోని వచ్చాడని గిట్టని వాళ్ళు అంటారు.
కారణం ఏదైనా…. బండ్ల గణేష్ ని ఆటలో అరటిపండుగా చూసినా, మరోవిధంగా అనుకున్నా… తనకంటూ ఒక క్రేజ్ మాత్రం సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఫ్యాన్స్ లో ఫ్యాన్స్ అంటే మాటలు కాదు కదా.