పోసానిని భరిస్తున్న తల్లికి వందనం!

- Advertisement -
Bandla Ganesh


పోసాని కృష్ణ మురళి డేట్ అయిపోయిన టాబ్లెట్ లాంటివాడని, తీసుకుంటే పాయిజన్ అవుతుంది అని ఘాటుగా కామెంట్ చేశారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ మాట విని ‘మా’ ఎన్నికల నుంచి తప్పుకున్నారు బండ్ల. పనిలో పనిగా పోసానిపై తన అభిప్రాయం చెప్పారు.

“పోసాని గారు మొదట ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై కొన్ని విమర్శలు చేశారు. దాన్ని నేను తప్పు పట్టను. అది రాజకీయంలో భాగంగా చూస్తాను. కానీ రెండో రోజు ప్రెస్ క్లబ్బులో పోసాని చేసిన వ్యాఖ్యలను బుర్ర ఉన్నవాళ్ళెవరూ సమర్ధించలేరు. తల్లిని, కూతురిని కూడా విమర్శల్లోకి లాగితే ఎలా ఊరుకుంటాం. పవన్ కళ్యాణ్ ని తిట్టండి కానీ ఆయన తల్లిని, ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడటం తప్పు. ఆయనని అందరూ అసహ్యించుకుంటున్నారు,” అని ఫైర్ అయ్యారు బండ్ల.

“పోసాని కృష్ణ మురళీగారి భార్యని గౌరవిస్తాను. ఆమెని తల్లిగా చూస్తాం. పోసానిని భరిస్తున్న ఆ తల్లి సహనానికి వందనం,” అంటూ చివరి పంచ్ వదిలారు.

ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి మాటలు టెలికాస్ట్ చేసేందుకు టీవీ ఛానెల్స్ భయపడుతున్నాయి.

More

Related Stories