‘సంక్రాంతి మొనగాడు చిరంజీవి’

‘సంక్రాంతి మొనగాడు చిరంజీవి’

ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’, అజిత్ మూవీ ‘తెగింపు’, చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, విజయ్ మూవీ ‘వారసుడు’, చిన్న చిత్రం ‘కళ్యాణం కమనీయం’ విడుదలయ్యాయి. ఐదు సినిమాలు పోటీలో ఉండగా మొదటి రోజు బాలయ్య మూవీ అందరి అంచనాలు మించి వసూళ్లు పొంది అదరగొట్టింది. చిరంజీవి మూవీ స్లోగా స్టార్ట్ అయి పికప్ అయింది. ఇప్పుడు అమెరికా నుంచి ఆంధ్రా వరకు సూపర్ గా ఆడుతోంది.

దాంతో, చిరంజీవి సంక్రాంతి విన్నర్ అని ప్రకటించారు నిర్మాత బండ్ల గణేష్.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి విషెస్ ట్వీట్ పెట్టగానే, దానికి స్పందిస్తూ బండ్ల ట్వీటారు. “సంక్రాంతి మొనగాడు మా అన్న,” అని రాశారు.

‘వాల్తేర్ వీరయ్య’ కలెక్షన్లు అన్ని చోట్లా బాగుండడంతో బండ్ల ఇలా ఓపెన్ గా చిరంజీవిని విన్నర్ గా డిక్లేర్ చేశారు.

 

More

Related Stories