
పవన్ కళ్యాణ్ తో మరో మూవీ నిర్మించాలని బండ్ల గణేష్ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ‘గబ్బర్ సింగ్’ వంటి మరో బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ తో తీయాలనేది అతని కోరిక. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.
ఐతే, సెకండ్ వేవ్ బండ్ల ఆశలపై నీళ్లు చల్లింది. పవన్ కళ్యాణ్ బండ్ల బ్యానర్లో సినిమా చేద్దామని అనుకున్నా… ఇప్పట్లో సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న, ఒప్పుకున్న సినిమాలే ఆలస్యం కానున్నాయి. ప్రస్తుతం సెట్ మీదున్న రెండు సినిమాలు కాకుండా… మరో రెండు సినిమాలు ఇప్పటికే ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్.
2023లో కానీ అవి పూర్తి కావు. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు పవన్ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పలేం. అందుకే బండ్ల గణేష్ చాలా కాలం ఆగాలి. లేదంటే…. పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న రెండు సినిమాల్లో ఎదో ఒకటి పక్కన పెట్టి గణేష్ కి ప్రియారిటీ ఇవ్వాలి.
మరోవైపు తాన్ తండ్రికి హెయిర్ కట్ చేశాడు బండ్ల గణేష్. సెకండ్ వేవ్ వల్ల తండ్రిని బయటికి అడుగుపెట్టనివ్వడం లేదు గణేష్. తానే ట్రిమ్మర్ తీసుకొని హెయిర్ కట్ చేసి, ఆ వీడియోని పోస్ట్ చెయ్యడం విశేషం.