రాజకీయాలకు కంప్లీట్ గా దూరమే!

- Advertisement -
Bandla Ganesh

ఇంగ్లీష్ లో ఒన్స్ బిట్టెన్ ట్వైస్ షై అనే సామెత ఉంది. ఒకసారి ఏదైనా విషయంలో దెబ్బతింటే ఇంకోసారి దాని జోలికెళ్లరు అనే అర్థంలో ఆ సామెతని వాడుతారు. బండ్ల గణేష్ పరిస్థితి ఇదే ఇప్పుడు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ లో చేరి నానా వీరంగం వేశాడు బండ్ల గణేష్. ఐతే, ఇప్పుడు మాత్రం రాజకీయాలంటేనే బయపడుతున్నాడు.

తెలంగాణాలో సడెన్ గా బీజేపీ రైజ్ అవుతోంది. మరింతగా బలపడేందుకు పలువురు సినిమా సెలెబ్రిటీలపై ఫోకస్ పెట్టింది. బండ్ల గణేష్ కూడా ఇపుడు బీజేపీ బాట పట్టేలా ఉన్నాడు అని స్పెక్యులేషన్లు జోరుగా సాగుతున్నాయి. పైగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా బీజేపీకి మిత్రపక్షమే. దాంతో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

కానీ ఈ గబ్బర్ సింగ్ నిర్మాత మాత్రం తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటాను అని మరోసారి స్పష్టంచేశాడు. రాజకీయాలకు శాశ్వతంగా దూరం అని చెప్పేశాడు.

 

More

Related Stories