హరీష్ కి బండ్ల ఖరీదైన గిఫ్ట్

Harish Shankar and Bandla Ganesh


దర్శకుడు హరీష్ శంకర్ కెరీర్ లో మర్చిపోలేని బ్లాక్ బస్టర్… గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇష్టమైన చిత్రం అది. ఇక నిర్మాత బండ్ల గణేష్ కెరీర్ లో కూడా అది ఒక ల్యాండ్ మార్క్. ఈ సినిమా విడుదలై 10 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ కి బండ్ల గణేష్ ఖరీదైన వాచీ బహుమతిగా ఇచ్చారు.

నాలుగు, ఐదు లక్షల విలువ చేసే ఈ వాచీని హరీష్ కి అందించారు బండ్ల గణేష్.

‘గబ్బర్ సింగ్’తో పవన్ కళ్యాణ్ కొత్త స్టార్డం చూశారు. అంతకుముందు వరుసగా అపజయాలు. వాటికి అడ్డుకట్ట వేసి తిరుగులేని విజయాన్ని తెచ్చింది ఆ మూవీ. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’, ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ వంటి విజయాలు చూశారు పవర్ స్టార్.

పవన్ కళ్యాణ్ తో మరో సినిమా తీయాలని బండ్ల చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ, అది వర్కౌట్ కావడం లేదు. మరోవైపు, హరీష్ శంకర్ మాత్రం పవన్ కళ్యాణ్ కోసం ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ ఏడాది ద్వీతీయార్ధంలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కెమెరామన్ తో షూటింగ్ చర్చలు మొదలుపెట్టారు హరీష్.

 

More

Related Stories