‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేష్


నిత్యం వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న మూవీకి ‘డేగల బాబ్జీ’ పేరు పెట్టారు. టైటిల్ పోస్టర్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు.

వెంకట్ చంద్ర అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఈ మూవీని స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ మొదలైంది.

“తమిళంలో విజయం సాధించిన ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ అనే చిత్రం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నాం. తమిళంలో ఆర్. పార్తిబన్ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘డేగల బాబ్జీ’ టైటిల్‌కూ మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది,” అని మేకర్స్ అన్నారు.

 

More

Related Stories