ఫైనలైజ్ ఐతే నేనే చెప్తా: బండ్ల

Puri and Pawan

పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేస్తాడు? ఆయన ఒప్పుకుంటే మరో అర డజన్ సినిమాలు ప్రకటించేందుకు నిర్మాతలు క్యూలో ఉన్నారు. ‘వకీల్ సాబ్’ పూర్తి అయింది. పవన్ – రానా కాంబినేషన్లో ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. క్రిష్ తీస్తున్న పీరియడ్ మూవీ సెట్స్ పై ఉంది. హరీష్ శంకర్ – మైత్రి మూవీ మేకర్స్ తీసే సినిమా ఈ ఏడాది మొదలవ్వాలి.

ఆ తర్వాత ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తాడు అనేది… ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సీన్ పై ఆధారపడి ఉంటుంది. స్థానిక ఎన్నికలున్నా.. ఏదైనా రాజకీయ సమస్య వచ్చినా సినిమా షూటింగ్ బంద్. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాల షెడ్యూల్స్ ఏవీ అనుకున్నట్లు జరగవు. ఐతే, కానీ హరీష్ శంకర్ సినిమాతో పాటు నా సినిమాని కూడా పట్టాలెక్కించండి అని నిర్మాత బండ్ల గణేష్ అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సై అంటే… ‘లైగర్’ షూటింగ్ పూర్తి అయిన వెంటనే స్క్రిప్ట్ రెడీ చేసేలా ప్లాన్ చేసాడట.

కానీ అలా పవన్ కళ్యాణ్ తో కుదరదు. ఆయన ఒక సినిమా ఒప్పుకోవాలంటే చాలా తతంగం ఉంటుంది. ప్లస్, పవన్ కళ్యాణ్ కి చెప్పకుండా అనౌన్స్ మెంట్ లు, లీకులు ఇస్తే అది అసలుకే మోసం వస్తుంది.

అందుకే కాబోలు ఈ ప్రచారం మొదలు కాగానే బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు. “నా బ్యానర్లో ఏ సినిమా సెట్ అయినా నేనే స్వయంగా ప్రకటిస్తా,” అని రాసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రియారిటీ లిస్ట్ లో చాలామంది దర్శకులు, నిర్మాతలు ఉన్నారు. వాళ్ళందరిని కాదని బండ్లకి పవన్ కళ్యాణ్ ఇస్తారా అన్నది డౌటే.

More

Related Stories