శృతి సీక్రెట్ చెప్పిన బండ్ల!

shruti bandla ganesh

కెమెరా ముందుకొచ్చాడంటే కాంట్రవర్సీ చేయకుండా ఉండడు నిర్మాత బండ్ల గణేష్. అదేంటో ఆయన ఏది మాట్లాడినా వివాదాస్పదం అవుతుంది. ఇప్పుడు అలాంటిదే మరో ప్రయత్నం చేశాడు ఈ నిర్మాత. ఈసారి శృతిహాసన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

“గబ్బర్ సింగ్” టైమ్ లో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకోవద్దంటూ హీరో పవన్ కల్యాణ్ ను గట్టిగా కోరాడట ఈ నిర్మాత. ఎందుకంటే, ఆమె అప్పటికే వరుసగా ఫ్లాపులు ఇచ్చిందనేది బండ్ల వాదన. అయితే దీనిపై తనకు పవన్ పెద్ద క్లాస్ పీకాడని చెప్పుకొచ్చాడు.

“బాబు.. ఈ అమ్మాయి మనకొద్దు, మార్చేద్దాం అన్నాను. ఎందుకని పవన్ అడిగారు. నాకు నాలుక కంట్రోల్ లో ఉండదు కదా. అమ్మాయి (శృతిహాసన్) అన్నీ ఫ్లాపులే ఇచ్చింది కదా అనేశాను. నువ్వు అన్నీ సూపర్ హిట్లు తీశావా అని పవన్ అడిగాడు. ఇంక నాకు మాట లేదు. పోరా.. పని చూస్కో, ఆ అమ్మాయే హీరోయిన్ అన్నాడు.”

ఇలా “గబ్బర్ సింగ్” టైమ్ లో హీరోయిన్ ఎంపికపై జరిగిన తెరవెనక సంగతిని బండ్ల బయటపెట్టారు. “గబ్బర్ సింగ్”ను నిర్మించే అవకాశం తనకు త్రివిక్రమ్ వల్ల వచ్చిందని.. త్రివిక్రమ్ పవన్ కు చెప్పడం వల్లనే తనకు గబ్బర్ సింగ్ నిర్మించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.

Related Stories